ఇలా చేస్తే.. మీ ఫోన్లకు చెత్త స్పామ్ కాల్స్ రావు

25-11-2022 Fri 13:38 | Technology
  • నేషనల్ కస్టమర్ రిజిస్ట్రీయే మెరుగైన మార్గం
  • ఫోన్ నుంచి డీఎన్ డీ యాక్టివేట్ చేసుకోవచ్చు
  • అప్పుడు మార్కెటింగ్, స్పామ్ కాల్స్ కు చెక్
టెలీ మార్కెటింగ్, స్పామ్ కాల్స్ వేధింపులు ఎక్కువైపోయాయి. ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు ఇలాంటి కాల్స్ వస్తే చిర్రెత్తుకొస్తుంది. కొన్ని సందర్భాల్లో వీటి కారణంగా ముఖ్యమైన కాల్స్ మిస్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇప్పుడు మోసపూరిత కాల్స్ కూడా పెరిగిపోయాయి. వీటిని తమ ఫోన్లో బ్లాక్ చేసుకున్నా పెద్దగా ఉపయోగం ఉండడం లేదు. ఎందుకంటే ఫ్రాడ్ స్టర్స్, మార్కెటింగ్ వ్యక్తులు వందల సంఖ్యలో నంబర్లను ఉపయోగిస్తుంటారు. అందుకని వీటిని మొత్తంగా బ్లాక్ చేసుకోవడమే పరిష్కారం.

టెలికం రంగ నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’.. నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ ను నిర్వహిస్తోంది. గతంలో దీన్ని నేషనల్ డు నాట్ కాల్ రిజిస్ట్రీ (ఎన్ డీఎన్ సీ) అని పిలిచేవారు. డు నాట్ డిస్టర్బ్ కోసం ఫోన్ లో ఎస్ఎంఎస్ యాప్ ఓపెన్ చేసి.. START DND అని టైప్ చేసి 1909కు పంపించాలి. తర్వాత టెలికం సర్వీసు ప్రొవైడర్.. బ్యాంకింగ్,  హాస్పిటాలిటీ తదితర ఆప్షన్లు, వాటి కోడ్స్ పంపిస్తారు. కోడ్ నంబర్ తో రిప్లయ్ ఇస్తే ఆయా కాల్స్ బ్లాక్ అయిపోతాయి. 

24 గంటల్లో డీఎన్ డీ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు అనుచిత థర్డ్ పార్టీ కమర్షియల్ కాల్స్, ఎస్ఎంఎస్ లు నిలిచిపోతాయి. కానీ, బ్యాంకుల నుంచి ఖాతాదారులకు వచ్చే ఎస్ఎంఎస్ అలర్ట్ లు, ఆన్ లైన్ పోర్టళ్ల నుంచి వచ్చే ఎస్ఎంఎస్ లు, వాట్సాప్ తదితర థర్డ్ పార్టీ యాప్ ల నుంచి వచ్చే కాల్స్ ఆగవు. ఎందుకంటే అవి తమ కస్టమర్లకు పంపిస్తున్న ఎస్ఎంఎస్ లు కనుక. 

జియో యూజర్లు మై జియో యాప్ లో, సెట్టింగ్స్ ను ఓపెన్ చేయాలి. అక్కడ కనిపించే డునాట్ డిస్టర్బ్ ఎంపిక చేసుకోవాలి. అక్కడ పలు కేటగిరీలు కనిపిస్తాయి. వాటి నుంచి కావాలనుకున్నది బ్లాక్ చేసుకోవచ్చు. ఎయిర్ టెల్ యూజర్లు ఎయిర్ టెల్ డీఎన్ డీ పోర్టల్  https://www.airtel.in/airtel-dnd/ కు వెళ్లి అక్కడ మొబైల్ నంబర్ ఇవ్వాలి. మొబైల్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. అక్కడ కనిపించే కేటగిరీల్లో కావాలనుకున్న వాటిని బ్లాక్ చేసుకోవాలి. 

వొడాఫోన్ ఐడియా కస్టమర్లు https://www.myvi.in/dnd పోర్టల్ కు వెళ్లి బ్లాక్ చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు తమ ఫోన్ నుంచి START DND అని టైప్ చేసి 1909కు పంపించాలి. ఆ తర్వాత వచ్చే ఆప్షన్ల నుంచి ఎంపిక చేసుకుని రిప్లయ్ ఇవ్వాలి.
spam callsmarketing callsDNDbloc

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more